స్తుతి సింహాసనాశీనుడా
అత్యంత ప్రేమమయుడా
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రి
సమాధానకర్తయగు అధిపతి నీవే
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
మా రక్షణ కర్త మారని మా దేవా
మాలోన వసియించు మహిమా స్వరూప
మహిమా ఘనత ప్రభావము నీకే
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
గానం: దీపక్ అవినాష్
No comments:
Post a Comment