Wednesday, 8 March 2017

భక్తులారా స్మరియించెదము | సీయోను గీతములు | Bhaktulara Smariyinchedamu | ...





సీయోను గీతములు | పాట నెం.186 | భక్తులారా స్మరియించెదము

భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న మరి, సర్వము చక్కగ జేసె

1. శ్రీయేసే మన శిరస్సై యుండి, మహాబలశూరుండు ..2
సర్వమునిచ్చెను తన హస్తముతో - ఎంతో దయగలవాడు ||భక్తు||

2. గాలి తుఫానులను గద్దించి, బాధలను తొలగించె
శ్రమలలొ మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్ ||భక్తు||

3. జివ నదిని ప్రవహింపజేసె, సకల స్థలంబులయందు
లెక్కకుమించిన ఆత్మల తెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు ||భక్తు||

4. అపొస్తలుల, ప్రవక్తలను, సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చె ||భక్తు||

5. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె ||భక్తు||

6. ఈ భువియందు జీవించుకాలం, బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే ||భక్తు||

7. కొంచెము కాలమే మిగిలియున్నది, ప్రభువును సంధించుటకై
గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గములయందు ||భక్తు||

No comments:

Post a Comment