FaithWalk Studios
Wednesday, 8 March 2017
భక్తులారా స్మరియించెదము | సీయోను గీతములు | Bhaktulara Smariyinchedamu | ...
సీయోను గీతములు | పాట నెం.186 | భక్తులారా స్మరియించెదము
భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న మరి, సర్వము చక్కగ జేసె
1. శ్రీయేసే మన శిరస్సై యుండి, మహాబలశూరుండు ..2
సర్వమునిచ్చెను తన హస్తముతో - ఎంతో దయగలవాడు ||భక్తు||
2. గాలి తుఫానులను గద్దించి, బాధలను తొలగించె
శ్రమలలొ మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్ ||భక్తు||
3. జివ నదిని ప్రవహింపజేసె, సకల స్థలంబులయందు
లెక్కకుమించిన ఆత్మల తెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు ||భక్తు||
4. అపొస్తలుల, ప్రవక్తలను, సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చె ||భక్తు||
5. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె ||భక్తు||
6. ఈ భువియందు జీవించుకాలం, బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే ||భక్తు||
7. కొంచెము కాలమే మిగిలియున్నది, ప్రభువును సంధించుటకై
గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గములయందు ||భక్తు||
ఊహించలేని మేలులతో నింపిన | Oohinchaleni Melulatho Nimpina | Telugu Chris...
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం ||2||
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ ||2|| ||ఊహించలేని||
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ||2||
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ ||2|| ||ఊహించలేని||
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు ||2||
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||2|| ||ఊహించలేని||
Oohinchaleni Melulatho Nimpina
Naa Yesayyaa Neeke Naa Vandanam ||2||
Varninchagalanaa Nee Kaaryamul
Vivarinchagalanaa Nee Melulan ||2|| ||Oohinchaleni||
Melutho Naa Hrudayam Thrupthiparachinaavu
Rakshana Paathranichchi Ninu Sthuthiyinthunu ||2||
Israyelu Devudaa Naa Rakshakaa Sthuthiyinthunu
Nee Naamamun ||2|| ||Oohinchaleni||
Naa Deenasthithini Neevu Maarchinaavu
Naa Jeevithaaniki Viluvanichchinaavu ||2||
Nee Krupaku Nannu Aahvaninchinaavu
Nee Sannidhi Naaku Thodunichchinaavu ||2|| ||Oohinchaleni
కలములతో రాయగలమా.. కవితలతో వర్ణింపగలమా | Kalamulatho rayagalama.. kavital...
కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా
!! కలములతో రాయగలమా !!
* ఆరాధింతును ఆరాధింతును !!2!!
నా రాజువు నీవే నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను !!2!!
* ఆకాశములు.... నీ మహిమను....
వివరించుచున్నవి. . . .
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది. . . . !!2!!
దేవా నా ప్రాణము....
నీ కొరకై తపియించుచున్నది !!2!!
!! ఆరాధింతును ఆరాధింతును !!
* సెరాపులు.... కెరూబులు....
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహాదూతలు.... ప్రధానదూతలు....
నీ నామము కీర్తించుచున్నవి !!2!!
దేవా నా ప్రాణము. . . .
నీ కొరకై తపియించుచున్నది !!2!!
!! ఆరాధింతును ఆరాధింతును !!
!! కలములతో రాయగలమా !!
+ గానం: దీపక్ అవినాష్
స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. | Sthuti simhasanasinuda.. Ath...
స్తుతి సింహాసనాశీనుడా
అత్యంత ప్రేమమయుడా
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రి
సమాధానకర్తయగు అధిపతి నీవే
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
మా రక్షణ కర్త మారని మా దేవా
మాలోన వసియించు మహిమా స్వరూప
మహిమా ఘనత ప్రభావము నీకే
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
గానం: దీపక్ అవినాష్
ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది | Oohalakandanidi nee thyagam |
ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది ఊసులకందనిది నీ యాగం వివరింపజాలనిది నీ కొరకే నా త్యాగం మన కొరకే బలియాగం ఎంత ప్రేమయ్యా యేసు వింత ప్రేమయ్యా (2) ఎవరూ చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా ఎవరూ చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా ఏమని వర్ణింతును ఏమని వివరింతును నీ గప్ప త్యాగాన్ని ఆ గొప్ప యాగాన్ని (2) నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలచి ఎంచలేని మంచిని నాలో పెంచాలని యెంచి యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించిన యేసు నన్ను బ్రతికించినా (2) నిన్నే నమ్ముకున్నానయ్యా (2011) రచన, గానం: బ్రదర్ పి. సతీష్ కుమార్
Subscribe to:
Posts (Atom)